Studio18 News - ANDHRA PRADESH / Kakinada : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గం పిఠాపురం పట్టణం,యు.కొత్తపల్లి, గొల్లప్రోలులో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫైమన్ కమిటీ సభ్యులు డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండె దొరబాబు, ఓదురి కిషోర్, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి విద్యార్థి విద్యారంగంలో రాణించాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ముందుగా పిఠాపురం ఆర్.ఆర్. బి.హెచ్.ఆర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మెగా పీటీఎం కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా విచ్చేసి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే మంచి అలవాట్లు క్రమశిక్షణ నేర్చుకోవాలని తద్వారా మీరు చదివిన స్కూలుకి మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులని ఒకచోట కలిపే ప్రయత్నం చేసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మధ్య సఖ్యత పెరుగుతుందని తెలిపారు.అదేవిధంగా పిఠాపురం పట్టణంలో ఉన్న విద్యార్థులకు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అందజేసిన క్రీడ కిట్లును ప్రతి ఒక్కరు వినియోగించుకుని ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతంగా ఉండి ఉన్నత స్థాయికి వెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫైమన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండె దొరబాబు, ఓదురి కిషోర్, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, మత్స్యకార నాయకులు,కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్ల లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News