Tuesday, 31 March 2026 04:35:23 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

అమరావతి కేవలం భ్రమ అని మాట్లాడుతున్న వారికి త్వరలోనే వాస్తవాలు కనిపిస్తాయి: మంత్రి నారాయణ

Date : 23 March 2026 04:50 PM Views : 14

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : రాజధాని అమరావతి నిర్మాణంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణం కేవలం భ్రమ అని మాట్లాడుతున్న వారికి త్వరలోనే వాస్తవాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయని హెచ్చరించారు. అమరావతిలో నిర్మించబోయే ప్రతి కట్టడం 'ఐకానిక్'గా ఉంటుందని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం ప్రపంచంలోనే అత్యుత్తమ శాసనసభ కేంద్రంగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం కోసం చేస్తున్న అప్పుల గురించి వస్తున్న ఆరోపణలపై మంత్రి నారాయణ స్పష్టమైన వివరణ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక క్రమశిక్షణ లేదని విమర్శించిన ఆయన, కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోందని చెప్పారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేసిన భూముల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంతోనే పెండింగ్‌లో ఉన్న అప్పులను తీరుస్తామని వెల్లడించారు. భూముల విలువ పెరిగేలా మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ప్రస్తుతం అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల కోసం నిర్మిస్తున్న సుమారు 3,500 ఫ్లాట్లు ఈ మార్చి నెలాఖరు కల్లా పూర్తి కానున్నాయని చెప్పారు. సెక్రటేరియట్, హైకోర్టు వంటి ఐకానిక్ భవనాలను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, స్పోర్ట్స్ సిటీ కోసం ఇప్పటికే రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసిందని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :