Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ ఈఏపీసెట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థి సత్తా చాటాడు. ఇంజినీరింగ్ విభాగంలో హైదరాబాద్‌లోని వనస్థలిపురం విద్యార్థి అనిరుధ్ రెడ్డి తొలి ర్యాంకు సాధించాడు. ఇక శ్రీకాళహస్తి విద్యార్థి భానుచరణ్ రెడ్డి రెండో ర్యాంకు.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన విద్యార్థి యశ్వంత్ మూడో ర్యాంక్ సాధించారు. నంద్యాల జిల్లా విద్యార్థి రామ్‌చరణ్ రెడ్డికి నాలుగో ర్యాంకు, అనంతపురం విద్యార్థి నితిన్‌కు ఐదో ర్యాంకు వచ్చాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను జేఎన్‌టీయూ కాకినాడ వీసీ ఆచార్య సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. జేఎన్‌టీయూ కాకినాడ ఆధ్వర్యంలో మే 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈఏపీసెట్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు నిర్వహించిన కేవలం 12 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయడం విశేషం. కాగా ఈ పరీక్షల్లో ఇంజినీరింగ్ విభాగంలో 1.89 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రి, ఫార్మసీ విభాగంలో 67,761 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/EAPCET వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
Admin
Studio18 News