Saturday, 24 January 2026 02:17:44 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Chandrababu: ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తాం: భారత్-ఈయూ సదస్సులో సీఎం చంద్రబాబు

Date : 13 November 2025 06:42 PM Views : 111

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : ముగిసిన భారత్-ఈయూ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం గ్రీన్ ఎనర్జీయే ప్రపంచానికి కీలకమని స్పష్టం చేసిన చంద్రబాబు ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని సీఎం ప్రకటన నౌకా నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని విదేశీ సంస్థలకు పిలుపు ప్రకృతి విపత్తులకు భూతాపమే కారణమని ఆందోళన భారత్-యూరోపియన్ యూనియన్ (ఈయూ) బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. ఈ సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు.. సుస్థిరాభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ ప్రాముఖ్యతపై కీలక ప్రసంగం చేశారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ను 'గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ'గా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, అర్మేనియా తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరిగిపోవడం వల్ల ప్రకృతి విపత్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. "క్లౌడ్ బరస్ట్ వంటి ఘటనలతో నగరాలు నీట మునుగుతున్నాయి. ఒకేచోట 40 సెంటీమీటర్ల వర్షపాతం కురవడం వంటి తీవ్ర పరిణామాలు గ్లోబల్ వార్మింగ్ వల్లే సంభవిస్తున్నాయి. ఈ ఉత్పాతాలను ఎదుర్కోవాలంటే మనమంతా కలిసి గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేయాలి" అని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ రంగాల్లో చురుగ్గా పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రానికి రానున్న డేటా సెంటర్లకు కూడా గ్రీన్ ఎనర్జీనే సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో భారత్, ఈయూ మరింత సమర్థంగా కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ సదస్సులో పెట్టుబడులను ఆకర్షించే దిశగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుతం భారత్ నౌకా నిర్మాణ రంగంలో వెనుకబడి ఉంది. ఈ రంగంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ముందుకు రావాలి" అని విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించారు. గ్రీన్ ఎనర్జీతో పాటు ఆర్గానిక్ ఆహార ఉత్పత్తుల రంగంలోనూ ఏపీ కీలకంగా పనిచేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రకృతి సేద్యంలో పండించిన 'అరకు కాఫీ' ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిందని గుర్తుచేశారు. మానవాళి సంక్షేమం కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :