Tuesday, 31 March 2026 04:35:02 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Tirumala Laddu: శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి .. విచారణ కమిషన్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Date : 03 February 2026 07:51 PM Views : 91

Studio18 News - ANDHRA PRADESH / Tirupati : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ కీలక నిర్ణయం సిట్ నివేదిక, ఛార్జ్‌షీట్‌లో తేడాలు ఉన్నట్టు గుర్తింపు అసలు వాస్తవాలు తేల్చి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి, అసలు వాస్తవాలను వెలికితీసేందుకు ప్రత్యేక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మంగళవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ సమర్పించిన నివేదిక, కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్, ప్రభుత్వానికి అందిన సమాచారం మధ్య తీవ్రమైన తేడాలు ఉన్నట్టు కేబినెట్ గుర్తించింది. సిట్ విచారణలో వెలుగు చూసిన కొన్ని కీలక అంశాలను ఛార్జ్‌షీట్‌లో ఎందుకు చేర్చలేదనే విషయంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ మూడు అంశాల మధ్య ఉన్న వ్యత్యాసాలను పరిశీలించి, అసలు సూత్రధారులను, వాస్తవాలను నిగ్గు తేల్చేందుకే విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కమిషన్ ద్వారా తిరుమల లడ్డూ పవిత్రతపై భక్తుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. విచారణ కమిషన్ నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని కేబినెట్ తెలిపింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :