Sunday, 25 January 2026 04:28:59 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

కడప నుంచి నేరుగా ఢిల్లీకి బయల్దేరుతున్న చంద్రబాబు

Date : 29 May 2025 12:41 PM Views : 288

Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని ముగించుకుని, వరుస కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. మూడు రోజుల మహానాడు ఈరోజు ముగియనుంది. అనంతరం, ఈ రోజు సాయంత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు కడప నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలోని తాజ్ హోటల్‌లో జరగనున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) వార్షిక సర్వసభ్య సమావేశానికి (ఏజీఎం) చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ సమావేశం సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య జరగనుంది. రేపు రాత్రి ఆయన ఢిల్లీలోనే బస చేస్తారు. శనివారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి, నేరుగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం సీహెచ్ గునేపల్లి గ్రామానికి వెళ్తారు. ఆ గ్రామంలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని, లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తారు. వాస్తవానికి ప్రతినెలా ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తుండగా, ఈసారి జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో, ఒక రోజు ముందుగానే అంటే మే 31వ తేదీనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పింఛన్ల పంపిణీ అనంతరం, సీఎం చంద్రబాబు స్థానిక గ్రామస్తులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. ఆ తర్వాత, పార్టీ శ్రేణులతో కూడా ఆయన భేటీ అవుతారు. కార్యక్రమాలన్నీ ముగించుకుని, శనివారం సాయంత్రం 5:15 గంటలకు ముమ్మిడివరం నుంచి విజయవాడకు ముఖ్యమంత్రి తిరుగుపయనమవుతారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :