Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : వైసీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. ఏలూరు జూట్ మిల్లు డైరెక్టర్ గా ఆయనను తీసుకున్న తర్వాత కబ్జా చేశారని ఆరోపించారు. పొన్నూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ..అధికారాన్ని అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వ కాలంలో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. గ్రీన్ గ్రేస్ అపార్ట్ మెంట్స్ నిర్మాణానికి గుంటూరు కార్పోరేషన్ అదికారుల నుండి జి ప్లస్ 5 అని అనుమతులు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా 15 అంతస్తులు నిర్మించారని అన్నారు. ఆ భవన నిర్మాణానికి రైల్వే శాఖ అధికారుల నుండి ఇప్పటి వరకూ ఎలాంటి అనుమతులూ లేవని తెలిపారు. 30 సంవత్సరాల క్రితం సంగం డెయిరీలో ఏదో జరిగిందని తనపై కేసు నమోదు చేసి జైలుకు పంపారన్నారు. అయినా దీటుగా ఎదుర్కొన్నానని తెలిపారు. అక్రమ కేసులు పెట్టినప్పటికీ రాజకీయంగా కక్ష సాధించాల్సిన అవసరం తనకు లేదని నరేంద్ర పేర్కొన్నారు.
Admin
Studio18 News