Studio18 News - ANDHRA PRADESH / : బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మరికొద్దిసేపట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ముంబై చేరుకున్నారు. అలాగే, బీజేపీ, ఎన్డీయే కూటమి రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ముంబై చేరుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ వచ్చారు. ఈ ప్రమాణ స్వీకార వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు షారుక్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్ కూడా హాజరవుతున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఫడ్నవీస్ తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఫడ్నవీస్‌పై పెద్ద బాధ్యత: అమృత ఫడ్నవీస్ ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఆయన భార్య అమృత ఫడ్నవీస్‌ను మీడియా పలకరించింది. ఫడ్నవీస్ ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచారని, మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలిపారు. ఈ విషయంలో ఆనందంతో పాటు ఆయనపై అతిపెద్ద బాధ్యత ఉందనే విషయం అర్థమవుతోందన్నారు.
Also Read : ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం... జబర్దస్త్ రాంప్రసాద్‌కు గాయాలు
Admin
Studio18 News