Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా ఏదో అనుకుంటే... మరేదో జరిగింది. వివరాల్లోకి వెళ్తే తిరుమల లడ్డూ అంశంపై ఆమె తన యూట్యూబ్ ఛానల్ లో పోల్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో వచ్చిన ఫలితాలు రోజాకు షాక్ ఇచ్చాయి. తిరుపతి లడ్డూను కల్తీ చేసింది ఎవరని ఆమె పోల్ చేపట్టగా జగన్ దే తప్పంటూ 74 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఎవరి పాలనలో తిరుమల బాగుందని ఆమె పోల్ పెట్టగా... చంద్రబాబు పాలనలో బాగుందని 77 శాతం మందికి పైగా ఓటు వేశారు. ఆ విధంగా వచ్చిన పోల్ ఫలితాలు రోజాకు ఝలక్ ఇచ్చాయనే చెప్పచ్చు!
Admin
Studio18 News