Monday, 02 December 2024 04:38:22 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Pawan Kalyan: నిస్వార్థ కర్మయోగి, సాటిలేని సాధకుడికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

Date : 17 September 2024 03:38 PM Views : 67

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : నేడు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ 74వ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ద్వారా బ‌ర్త్ డే విషెస్ తెలిపారు. "నా స్ఫూర్తి, ప్రపంచ నాయకుడు, నిస్వార్థ కర్మయోగి, సాటిలేని సాధకుడు గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పుట్టిన‌రోజు శుభాకాంక్షలు. హృదయపూర్వక అభినందనలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, క్షేమంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. మీరు దేశభక్తికి ప్రతిరూపం. మీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ శాంతి, శ్రేయస్సు, శక్తికి కేంద్రంగా ఉద్భ‌వించింది. భార‌త విజయవంతమైన ప్రధానిగా ఉదారమైన, శాంతియుతమైన, సమానమైన ప్రపంచాన్ని నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషించడం ద్వారా ఇండియాను మళ్లీ విశ్వ గురువుగా తీసుకెళ్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. అది జరగడానికి మార్గం సుగమం చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా వలసపోతున్న కోట్లాది మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలు, శుభాకాంక్షలు ఎల్లప్పుడూ మీతో ఉంటాయి. ప్రియమైన ప్రధానమంత్రి, మీకు మళ్లీ మీ పుట్టినరోజు శుభాకాంక్షలు!" అని జ‌న‌సేనాని ట్వీట్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు