Sunday, 08 March 2026 11:00:07 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

తమ్ముడి ఆరోగ్య పరిస్థితి విషమం.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తున్న చంద్రబాబు

హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామ్మూర్తినాయుడు ఈరోజు పూర్తిగా విషమించిన ఆరోగ్యం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని రద్

Date : 16 November 2024 12:51 PM Views : 385

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు ఆరోగ్యం విషమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్ కు బయల్దేరుతున్నారు. ఢిల్లీలో ఆంగ్ల దినపత్రిక కాంక్లేవ్ లో పాల్గొని ఆయన హైదరాబాద్ కు బయల్దేరుతారు. మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకోనున్న చంద్రబాబు... శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా తన సోదరుడు చికిత్స పొందుతున్న ఏఐజీ ఆసుపత్రికి వెళ్తారు. వాస్తవానికి చంద్రబాబు ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్లి... ఎన్డీయే తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. తమ్ముడి ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. కాసేపట్లో ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :