Thursday, 12 March 2026 12:33:42 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

మనిషి ప్రాణం పోతున్న పట్టించుకోని జనం.. వైరల్‌ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం

AP News | రోజురోజుకీ మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుందని చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం! రోడ్డు ప్రమాదానికి గురై కళ్ల ముందే మనిషి ప్రాణం పోతున్నా జనాలు

Date : 18 November 2025 07:48 PM Views : 274

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : AP News | రోజురోజుకీ మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుందని చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం! రోడ్డు ప్రమాదానికి గురై కళ్ల ముందే మనిషి ప్రాణం పోతున్నా జనాలు పట్టించుకోలేదు. మాకేం సంబంధమంటూ చూసి చూడనట్టుగా పక్క నుంచే వెళ్లిపోయారు. ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగిన ఈ దారుణంపై సోషల్‌మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కూరగల్లు ఓ బైకర్‌.. టిప్పర్‌ లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో అదుపుతప్పి కిందపడిపోయాడు. ఆ వెంటనే అతనిపై నుంచి టిప్పర్‌ లారీ రెండు చక్రాలు వెళ్లిపోయాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బైకర్‌ కొనఊపిరితో అక్కడే విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న జనాలు అది తామకేమీ పట్టదన్నట్లుగా ఉండిపోయారు. దగ్గరికి వెళ్లి సాయం చేయడమేమో కానీ.. కనీసం 108 అంబులెన్స్‌కు కాల్‌ చేయడానికి కూడా ముందుకు రాలేదు. నిండు ప్రాణం పోతుంటే మాకేం సంబంధం లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అక్కడే విలవిల్లాడుతూ బైకర్‌ ప్రాణాలు విడిచాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అక్కడ ఉన్నవారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణం పోతున్నా సమాజం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇక్కడ ఎవరూ పట్టించుకోరు.. ఎవరూ బాధ్యత తీసుకోరు.. ఎందుకంటే ఇది భారతదేశం అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. సమాజంలో మానవత్వం చచ్చిపోయిందని అంటూ ఆవేదన చెందుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :