Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేశ్... వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హత్య కేసును కూడా ఎదుర్కొంటున్నారు. తాజాగా, ఈ మహిళ హత్య కేసులో నందిగం సురేశ్ ను పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు సురేశ్ కు అక్టోబరు 21 వరకు రిమాండ్ విధించింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టయి గుంటూరు జైల్లో ఉన్న నందిగం సురేశ్ ను... పోలీసులు తాజాగా మహిళ హత్య కేసులో అరెస్ట్ చేశారు. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హత్యకు గురైంది. ఈ హత్య కేసుకు సంబంధించి ఇటీవల పోలీసులు పీటీ వారెంట్ కోరగా... కోర్టు అనుమతి ఇచ్చింది.
Admin
Studio18 News