Tuesday, 31 March 2026 04:31:42 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Chandrababu: రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష

Date : 28 January 2026 06:13 PM Views : 49

Studio18 News - ANDHRA PRADESH / Visakhapatnam : పోర్టుల నుంచి ఇతర రాష్ట్రాలకు రైలు కనెక్టివిటీపై ప్రధానంగా చర్చ రాయలసీమ నుంచి కోస్తాకు మెరుగైన రైలు మార్గాలపై దృష్టి హై స్పీడ్ రైల్ కారిడార్ల ఏర్పాటు ప్రతిపాదనపై సమావేశంలో సమీక్ష విజయవాడ, విశాఖ వంటి జంక్షన్లలో రద్దీ తగ్గించడంపై చర్చ ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త మార్గాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. సచివాలయంలో దక్షిణ మధ్య, తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ల జనరల్ మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని హింటర్ ల్యాండ్‌కు సరుకు రవాణాను పెంచేందుకు అవసరమైన రైలు అనుసంధానంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అలాగే, రాయలసీమ ప్రాంతాల నుంచి కోస్తాంధ్రలోని వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరిచే అంశాలపైనా సమీక్షించారు. విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్, గుంటూరు, రేణిగుంట వంటి ప్రధాన జంక్షన్లలో రైళ్ల రద్దీని తగ్గించే మార్గాలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. విజయవాడ బైపాస్, భద్రాచలం రోడ్-కొవ్వూరు వంటి కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనల పురోగతిని కూడా సీఎం సమీక్షించారు. గిరిజన ప్రాంతాలకు రైలు సౌకర్యాన్ని విస్తరించడంపై ప్రత్యేకంగా చర్చించారు. హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు మార్గాలను హై స్పీడ్ రైల్వే కారిడార్లుగా అభివృద్ధి చేసే ప్రణాళికలపైనా ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి రైల్వే నెట్‌వర్క్ విస్తరణ కీలకమని ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :