Wednesday, 25 June 2025 07:10:23 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

తిరుపతి వ్యాపారికి పాకిస్థాన్ నుంచి బాంబు బెదిరింపు!

Date : 08 May 2025 01:21 PM Views : 74

Studio18 News - ANDHRA PRADESH / : తిరుపతిలో నివసించే ఓ వ్యాపారికి పాకిస్థాన్ నుంచి వచ్చినట్లుగా చెబుతున్న ఓ ఫోన్‌కాల్ తీవ్ర కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి, ఇంటిపై బాంబు వేసి పేల్చేస్తామంటూ ఆగంతకులు బెదిరించారు. విషయం వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది. తిరుపతికి చెందిన పగడాల త్రిలోక్‌ కుమార్‌ స్థానికంగా గాజుల వ్యాపారం నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం ఆయన తన ద్విచక్ర వాహనంపై తిరుమల కొండకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఉండగా +92 32925 27504 అనే అంతర్జాతీయ నంబర్ నుంచి ఆయన మొబైల్‌కు ఓ కాల్ వచ్చింది. ఫోన్ మాట్లాడిన వ్యక్తి తనను తాను పాకిస్థాన్‌కు చెందిన అధికారిగా పరిచయం చేసుకున్నట్లు సమాచారం. ఆగంతకుడు త్రిలోక్ కుమార్ కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ "మీరు ఏం చేస్తున్నారో మాకు అంతా తెలుసు. జాగ్రత్తగా ఉండకపోతే మీ ఇంటిపై బాంబు వేసి పేల్చేస్తాం" అని తీవ్ర స్వరంతో హెచ్చరించినట్లు బాధితుడు తెలిపారు. ఈ అనూహ్య పరిణామంతో తీవ్ర ఆందోళనకు గురైన త్రిలోక్‌ కుమార్‌ వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేసి పోలీసులకు విషయం తెలియజేశారు. ఈ ఘటనపై తిరుపతి క్రైమ్ విభాగం పోలీసులు స్పందించారు. సీఐ రామ్‌కిషోర్‌ మాట్లాడుతూ "ప్రాథమిక సమాచారం ప్రకారం పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి ఫోన్‌ చేసి బెదిరించినట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. పూర్తిస్థాయి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయి" అని వివరించారు. ఈ సంఘటనతో తిరుపతి నగరవాసుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కాల్ డేటా ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :