Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ ఏ కూటమిలో చేరదని... తమది తటస్థ వైఖరి అని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్డీయే, ఇండియా కూటమికి సమ దూరంలో ఉంటామని చెప్పారు. ఏ కూటమిలో చేరే ఆలోచన తమకు లేదని అన్నారు. ప్రాంతీయ పార్టీగా రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు. జమిలి ఎన్నికలపై తమ పార్టీ అధినేత జగన్ ఆలోచనకు అనుగుణంగా జీపీసీ ఎదుట తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ... 40 ఏళ్ల రాజకీయ జీవితంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ చెప్పిన మాట చేయలేదని అన్నారు. చంద్రబాబు చేతిలో ప్రజలు నాలుగోసారి మోసపోయారని చెప్పారు.
Also Read : బ్యాంక్ లోన్ తీసుకున్నవారు మరణిస్తే... ఎవరు కట్టాలి? రూల్స్ ఏంటి?
Admin
Studio18 News