Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరుతారు. గత నెలలో ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ వెళుతున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఇక ఈ నెల 24న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశం ఉంది. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి తన నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు.
Admin
Studio18 News