Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : రెండు తెలుగు రాష్ట్రాల్లో టమాటా, ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. నెల క్రితం వరకు కిలో రూ . 30 వరకు ఉన్న టమాటా ధర... కొన్ని రోజులుగా భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్ లో కిలో టమాటా రూ. 70 నుంచి రూ. 80 వరకు ఉంది. రీటైల్ మార్కెట్లో రూ. 100ను దాటేసింది. ఉల్లి ధర కూడా రిటైల్ మార్కెట్లో భారీగా పెరిగింది. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ. 60 నుంచి రూ. 70 వరకు ఉంది. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెపుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అనుకున్నంతగా పంట రాకపోవడం కూడా దీనికి కారణమని అంటున్నారు.
Admin
Studio18 News