Friday, 14 February 2025 07:13:51 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

#chittoor : ప్రభుత్వ లాంఛనాలతో అమర జవాన్ అంత్యక్రియలు

Date : 24 January 2025 12:29 AM Views : 48

Studio18 News - ANDHRA PRADESH / Chittoor : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడి వీర మరణం పొందిన కార్తీక్‌ యాదవ్‌ అంత్యక్రియలు బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ఎగువ రాగిమానిపెంటలో నిర్వహించారు. మధ్యాహ్నం 3.45 గంలలకు ఆర్మీ అధికారులు, స్థానిక పోలీసులు జవాను అంతిమ యాత్రను ఎగువ రాగిమానిపెంట గ్రామ వీధుల గుండా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటితో అమర జవానుకు తుది వీడ్కోలు పలికారు. జవాను అంత్యక్రియల్లో జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, పూతలపట్టు, చిత్తూరు ఎమ్మెల్యేలు కె.మురళి మోహన్‌, గురజాల జగన్మోహన్‌, చిత్తూరు నగర మేయర్‌ అముద, చుడా చైర్‌పర్సన్‌ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, పలమనేరు ఆర్‌డిఒ భవాని, బంగారుపాళ్యం తహశీల్దార్‌ బాబు రాజేంద్రప్రసాద్‌, 4/8 గుర్ఖా రైఫిల్‌ బెటాలియన్‌ లెఫ్టినెంట్‌ శివరాజ్‌ సింగ్‌ గిల్‌ పాల్గొని నివాళులర్పించారు. అధికార లాంఛనాలతో ఆర్మీ సిబ్బంది, పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. పదేళ్ల క్రితం ఆర్మీలో చేరిన కార్తీక్‌ యాదవ్‌ రాజస్థాన్‌ ఆర్మ్‌డ్‌ రెజిమెంట్‌లో ఏడేళ్లపాటు పని చేశారు. రెండేళ్ల క్రితం జమ్మూకు బదిలీ అయ్యారు. జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందారు. కార్తీక్‌ మృతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి, మంత్రి నారా లోకేష్‌, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వీరజవాన్‌ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు