Studio18 News - ANDHRA PRADESH / : లక్కీ పర్సన్ అంటే రఘురామకృష్ణరాజు అనే చెప్పాలి. గతంలో ఎంపీ అయి ఉండి, నియోజకవర్గంలో అడుగుపెట్టలేనంతగా తీవ్ర సమస్యలను ఎదుర్కొని, మొన్నటి ఎన్నికల్లో ఎంపీ టికెట్ వస్తుందో రాదో తెలియకుండా, చివరికి ఎమ్మెల్యే టికెట్ పై పోటీ చేసి... గెలుపొంది... నేడు ఏకంగా డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. అంతకంటే భాగ్యం ఏమిటంటే... రఘురామను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు వంటి హేమాహేమీలు చైర్ వద్దకు సగౌరవంగా తీసుకునివెళ్లి కూర్చోబెట్టారు. ఏపీ అసెంబ్లీ ఉప సభాపతిగా ఎన్నికైన రఘురామ నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు చంద్రబాబు, పవన్, అయ్యన్న శుభాకాంక్షలు తెలిపారు. ఇతర కూటమి ఎమ్మెల్యేలు చైర్ వద్దకు వెళ్లి రఘురామకు అభినందనలు తెలిపారు. అంతకుముందు, చైర్ వద్దకు వెళ్లే క్రమంలో రఘురామ... చంద్రబాబుకు పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలిపారు. పవన్ ను ఆత్మీయంగా హత్తుకుని హర్షం వ్యక్తం చేశారు.
Also Read : నరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్... కన్నీరుమున్నీరైన తల్లి... ఇదిగో వీడియో
Admin
Studio18 News