Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడి మృతి పట్ల ఏపీ మంత్రులు స్పందించారు. రామ్మూర్తినాయుడు గుండెపోటుతో మరణించడం పట్ల మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేశ్, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయస్వామి, నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామ్మూర్తినాయుడి కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢసానుభూతి తెలిపారు. రామ్మూర్తినాయుడి మృతి చంద్రగిరి ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు తీరని లోటు అని బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రామ్మూర్తినాయుడి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అటు, శాప్ చైర్మన్ రవినాయుడు స్పందిస్తూ... రామ్మూర్తినాయుడి మృతి కలచివేసిందని అన్నారు.
Also Read : 120 కోట్లు పెడితే వచ్చింది 25 కోట్లా?
Admin
Studio18 News