Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Kadambari Jethwani Case : ప్రభుత్వాలు వస్తుంటాయ్..పోతుంటాయ్. ఆఫీసర్లే పర్మినెంట్. ప్రతి పనికో లెక్క.. తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ప్రజాకోణం ఉంటేనే గుర్తింపు ఉంటుంది. కాదు కూడదని.. ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తే ఎప్పుడో ఓ రోజు పాపం పండుతుంది. ఉచ్చుబిగిస్తే అంతే సంగతులు. ఎంటైర్ కెరీర్‌లో సంపాదించుకున్న పేరు..చిన్న ఇష్యూతో ఢమాల్ అంటుంది. ఇప్పుడిదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు కొందరు అధికారులు. ఏపీలో వివాదంగా మారిన ఓ హీరోయిన్ కేసు ఇప్పుడు CID చేతికి వెళ్లబోతుందట. ఇప్పటికే బెయిల్ కోసం ఫైట్ చేస్తున్న ఆ ఆఫీసర్లకు..సీఐడీ గుబులు వెంటాడుతోందట. ఆ నటి కేసులో కొత్త కొత్త ట్విస్ట్‌లు ఉంటాయా.? ఇంకొందరు ఐపీఎస్ ఆఫీసర్స్ మెడకు చుట్టుకోబోతోందా.? ఈ ఎపిసోడ్‌లో మాజీ డీజీపీ పేరు ఎందుకు తెరమీదకు వస్తోంది.? పవర్‌లో ఉన్నప్పుడు ఏం చేసినా నడుస్తుంది. అనుకున్నోడి మీద కేసు పెట్టొచ్చు. తప్పు చేయనోన్ని కూడా ఇరకాటంలో పడేయొచ్చు. పర్మిషన్లు, చట్టాలు ఇవేవి అడ్డురావు. అందుకే అధికారం ఇచ్చే కిక్కే వేరు. అలాగని సమయం కలసి రాకపోతే అరాచకానికి మూల్యం చెల్లించుకోక కూడా తప్పదు. పవర్ చేతిలో ఉన్నప్పుడు ఏది పడితే అది చేశారు. ప్రభుత్వం మారింది. పాపాల చిట్ట బయటపడుతుంది. ఒకటా రెండా..స్యాండ్, మైన్, వైన్..చెప్పుకుంటూ పోతే పెద్ద కథే ఉంది. అంతేకాదు ఓ హీరోయిన్ కేసు కూడా కొందరు అధికారుల మెడకు చుట్టుకుంది. రేపోమాపో ముంబై నటి జత్వానీ కేసును సీఐడీకి ఇవ్వబోతున్నారట. దీంతో ఉన్న హెడెక్ చాలదని..ఇప్పుడు కొత్త లొల్లి వచ్చిపడబోతుందని పిసుక్కుంటున్నారట ఆ అధికారులు. మాకేం తెలియదని వాళ్లు.. మీ వెనక ఉన్నదెవరో చెప్పాలని పోలీసులు దీంతో రోజురోజుకు కేసు జఠిలం అవుతుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే హీరోయిన్ కేసులో ఆ అధికారులకు ముప్పుతిప్పలు తప్పేలా లేవు. ముంబై నటి జెత్వానీ కేసు దర్యాప్తును సీఐడీకి ఇస్తూ రేపోమాపో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందంటున్నాయి ప్రభుత్వం వర్గాలు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు సీనియర్ IPSలు PSR ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్ని సస్పెండ్ అయ్యారు. మరికొందరు పోలీసు అధికారులపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే నలుగురు పోలీసులతో పాటు సీనియర్ IPS అధికారులు, మరో న్యాయవాది బెయిల్ కోసం హైకోర్టుకెళ్లారు. అయితే ఇంకో సీనియర్ ఐపీఎస్ అధికారి పాత్ర ఉందన్న ఆరోపణలతో ఈ కేసును APCIDకి అప్పగించేందుకు సర్కార్ కసరత్తులు చేస్తోంది. ముగ్గురు అధికారుల సస్పెన్షన్, వారి మీద నమోదైన కేసులు ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లోకి మరో కొత్త కేరక్టర్ ఎంటరైందని అంటున్నారు. సీనియర్ IPSల మీద దర్యాప్తు జరుగుతున్న క్రమంలో మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పేరు కూడా తెరపైకి రావడం సంచలనం అవుతోంది. జెత్వానీ కేసులో నేరుగా నాటి డీజీపీ పేరు లేకున్నా.. పరోక్షంగా ఆయన వ్యవహారశైలిపైనే అధికార వర్గాల్లో చర్చ జరుగుతోందట. డీజీపీగా, స్టేట్ పోలీస్ బాస్‌గా ఈ కేసు విషయంలో ఏం జరుగుతోందో తెలిసి కూడా రాజేంద్రనాథ్ రెడ్డి ఆపలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఐడీ ఎంక్వైరీ స్టార్ట్ అయితే..మాజీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి నోటీసులు ఇస్తారని పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ కేసులో సస్పెండ్ అయిన ఐపీఎస్ ఆఫీసర్లు PSR ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్నిలపై గతంలో ఏమైనా ఆరోపణలు ఉన్నాయా..? అనే కోణంలో కూడా ప్రభుత్వ పెద్దలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అందరికంటే ఎక్కువగా PSR ఆంజనేయులు మెడకు APPSCలో జరిగిన వ్యవహారాలు చుట్టుకోబోతున్నట్టు టాక్. గ్రూప్స్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు.. వాల్యూయేషన్‌లో రకరకాల పద్దతులను ఫాలో అయ్యారనే అభియోగాలను తెరమీదకు వస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం సేకరించడంతో పాటు.. అవసరమైన సాక్ష్యాలను కూడా సిద్దం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి రాష్ట్ర పోలీస్ వర్గాలు. ఇదే జరిగితే PSR మరిన్ని కేసుల్లో ఇరుక్కోవడం ఖాయమని అంటున్నారు. ఇలా జెత్వానీ కేసు కొత్త పుంతలు తొక్కబోతోంది. ముందు ముందు ఇంకెన్ని ట్విస్ట్‌లు ఉంటాయో, ఏయే మలుపులు తిరుగుతాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.
Admin
Studio18 News