Studio18 News - TELANGANA / NIZAMABAD : పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ధర్పల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ పరభావ నామ సంవత్సర ఉగాది సందర్భంగా సంఘ భవనంలో మార్కండేయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉగాది పచ్చడిని తయారు చేసి కుల సభ్యులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు కొండ్యాల వినోద్, ఉపాధ్యక్షుడు చిలక నరేష్, సంఘం సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News