Studio18 News - తెలంగాణ / : తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీ.కే.శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీ చేసింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా రిజ్వీకి అదనపు బాధ్యతలను అప్పగించారు. విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శి హరీశ్‌కు రవాణా, ఆర్ అండ్ బీ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్ కుమార్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు. పురపాలనక శాఖ ఉపకార్యదర్శిగా ప్రియాంకను, హాకా ఎండీగా చంద్రశేఖర్ రెడ్డిని, మార్క్‌ఫెడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డిని, రవాణా, ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్‌ను బదిలీ చేశారు.
Admin
Studio18 News