Studio18 News - TELANGANA / MANCHERIAL : అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నిదానాలకంటే అన్నదానం గొప్పదని భావిస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గురువారం రోజున బెల్లంపల్లి కాంట చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ ప్రాంతంలో అమ్మ ఒడి ఎన్‌జీఓ అన్నదాత ప్రాజెక్ట్, టెక్నో డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. అన్నమో రామచంద్ర అని అలమటించే ఎందరో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు. గంప ఆరుణ–సత్యనారాయణ దంపతుల ఏకైక పుత్రిక స్నేహ వివాహం సాయిరాం తో మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు నడిచి ఏకమవుతున్న సందర్భంగా యాచకులు, నిరుపేదలు, దినసరి అడ్డ కూలీలు, బాటసారులకు సుమారు 200 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అమ్మ ఒడి అన్నదాత ప్రాజెక్ట్ వ్యవస్థాపకులు అజ్మీరా మోహన్, మంచిర్యాల జిల్లా బ్రాంచ్ మేనేజర్, టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమాండ్ల మధుకర్ మాట్లాడుతూ అమ్మ ఒడి అన్నదాత ప్రాజెక్ట్‌లో భాగంగా 370వ వారోత్సవ సందర్భంగా నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగిందన్నారు. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఒడి సభ్యులు హనుమాండ్ల సువర్ణ, గన్నేవరం తిరుమల చారి, బియ్యాల ఉపేందర్, భావాని, మేడిపల్లి రమేష్, ఎం.డి. యుసుఫ్, చెందుపట్ల లింగమూర్తి, కట్ట రాంకుమార్, కొలపూరి లక్ష్మణ్, అకుల మల్లేష్, ఖదీర్ పాల్గొన్నారు.
Admin
Studio18 News