Sunday, 29 March 2026 05:25:42 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Hydra Hyderabad: ఆక్రమణలపై హైడ్రా కొరడా... ఒకే రోజు రెండు చోట్ల చర్యలు

Date : 22 January 2026 06:55 PM Views : 275

Studio18 News - TELANGANA / HYDERABAD : గచ్చిబౌలి, శామీర్‌పేటలో ఆక్రమణలపై హైడ్రా ప్రత్యేక చర్యలు గచ్చిబౌలి టెలికాం నగర్‌లో 2500 గజాల పార్కు స్థలానికి విముక్తి శామీర్‌పేటలో 15 ఏళ్లుగా మూసివేసిన రోడ్డును తెరిపించిన అధికారులు ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులతో వేగంగా స్పందించిన హైడ్రా ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్, బోర్డులు ఏర్పాటు చేసిన సిబ్బంది హైదరాబాద్ నగరంలో ఆక్రమణలపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో చర్యలు చేపట్టింది. గచ్చిబౌలిలో ఓ విలువైన పార్కు స్థలాన్ని కాపాడగా, శామీర్‌పేటలో ఏళ్లుగా మూతపడిన రహదారికి విముక్తి కల్పించింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులు ఈ చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే, గచ్చిబౌలి టెలికాం నగర్‌లో 1982 నాటి లేఅవుట్‌లో 4000 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. అయితే, కాలక్రమేణా ఇందులో 1500 గజాలు ఆక్రమణకు గురై నిర్మాణాలు వెలిశాయి. మిగిలిన 2500 గజాల స్థలాన్ని కూడా కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో స్థానికులు హైడ్రా ప్రజావాణిని ఆశ్రయించారు. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. లేఅవుట్ ప్రకారం అది పార్కు స్థలమని నిర్ధారించుకుని, 2500 గజాల స్థలంలోని ఆక్రమణలను తొలగించారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఫెన్సింగ్ వేసి, 'పార్క్ స్థలం' అని బోర్డును ఏర్పాటు చేశారు. మరో ఘటనలో, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేటలోని ఫ్రెండ్స్ కాలనీలోనూ హైడ్రా చర్యలు చేపట్టింది. 1987 నాటి లేఅవుట్‌లోని 20 అడుగుల రోడ్డును కొందరు ఆక్రమించి గోడలు, గేటు నిర్మించారు. దీనిపై ప్రజావాణికి ఫిర్యాదు అందడంతో హైడ్రా అధికారులు గురువారం ఆక్రమణలను తొలగించి, రహదారిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. గత 15 ఏళ్లుగా ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, హైడ్రా చొరవతో తమ సమస్య తీరిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :