Studio18 News - TELANGANA / HYDERABAD : ఏప్రిల్ 2వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా గౌరవ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నాయకత్వంలో, భారాసా పార్టీ బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న హనుమాన్ శోభాయాత్రకు సంబంధించి సాహెబ్ నగర్‌లోని త్రినేత్ర ఆంజనేయ స్వామి ఆలయంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ శోభాయాత్ర బీఎన్ రెడ్డి నగర్ ఆటో స్టాండ్ నుండి సాహెబ్ నగర్ త్రినేత్ర ఆంజనేయ స్వామి ఆలయం వరకు నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమంలో భారాసా పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.
Admin
Studio18 News