Studio18 News - తెలంగాణ / : జోగులాంబ గద్వాల జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. జడ్పీ పాలక వర్గం పదవి కాలం పూర్తి కావడంతో కలెక్టర్ ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శనివారం జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకొని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు... కలెక్టర్ కు స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఛాంబర్ లో ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నర్సింగ రావు సంతకాలు చేయించి బాధ్యతలు అప్పగించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ సిబ్బందితో పరిచయం చేసుకొని సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకొని సిబ్బందికి పలు సూచనలు చేశారు
Admin
Studio18 News