Studio18 News - TELANGANA / NIRMAL : నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ నాయకత్వంలో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న “నారి శక్తి” కార్యక్రమం ఈ వారం కూడా మరింత ప్రభావవంతంగా కొనసాగింది. మహిళా పోలీస్ సిబ్బంది తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ డయల్ 100 కాల్స్‌కు తక్షణ స్పందన అందించి బాధితుల సమస్యలను వేగంగా పరిష్కరించారు. కుస్లీ, గడ్ చందా గ్రామాల్లో వచ్చిన డయల్ 100 కాల్స్‌కు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించారు. అలాగే బాసర గోదావరి నదిలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మహిళను విధుల్లో ఉన్న నారిశక్తి బృందం రక్షించి, ఆమె కుమారునికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని పాఠశాలలను సందర్శించిన మహిళా పోలీసులు విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించారు. అలాగే గ్రామాల్లోని ప్రజలకు మద్యం తాగి వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల సంభవించే ప్రమాదాలపై సూచనలు ఇచ్చారు. అనంతరం వాహన తనిఖీలు నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ “నారి శక్తి” కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల మహిళా సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
Admin
Studio18 News