Studio18 News - TELANGANA / KOMARAM BHEEM ASIFABAD : కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని కనికి శివా రులో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు కోసం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు అధికారులతో కలిసి ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్షణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం సహకారంతో కనికిలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. దానికి గాను 124 సర్వే నంబర్లో 80 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు గుర్తించారు. దాదాపుగా 50 ఎకరాల స్థలం అవసరం ఉంటుందని, స్థల సేకరణ పూర్తయితే పనులు ప్రారంభిస్తామని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈకార్యక్రమంలో ప్రొఫెసర్ డా.శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, మండల అధ్యక్షుడు విజయ్, తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News