Studio18 News - తెలంగాణ / : లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై రంగారెడ్డి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. కోర్టు... తీర్పును వాయిదా వేసింది. జానీ మాస్టర్‌ను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని నార్సింగి పోలీసులు నిన్న పిటిషన్ దాఖలు చేశారు. ఈ కస్టడీ పిటిషన్‌పై కోర్టు ఈరోజు విచారణ జరిపింది. విచారణ అనంతరం తీర్పును వాయిదా వేసింది. ఓ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో ఈ నెల 19న నార్సింగి పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్‌పై గోవా నుంచి అతనిని హైదరాబాద్‌కు తరలించారు. ఆ తర్వాత అతనిని రంగారెడ్డి కోర్టులో హాజరుపరచడంతో... కోర్టు అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
Admin
Studio18 News