Saturday, 24 January 2026 02:22:42 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

పెండింగ్‌ ఫైళ్లకు రెక్కలు!

ఔటర్‌ రింగు రోడ్డు (oRR) 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే ప్రక్రియను పురపాలక శాఖ వేగవంతం చేసింది. త్వరలో శివారు ప్రాంతాలు అధికారికంగా జీహె

Date : 02 December 2025 06:43 PM Views : 191

Studio18 News - TELANGANA / RANGAREDDY : ఔటర్‌ రింగు రోడ్డు (oRR) 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే ప్రక్రియను పురపాలక శాఖ వేగవంతం చేసింది. త్వరలో శివారు ప్రాంతాలు అధికారికంగా జీహెచ్‌ఎంసీలో విలీనం కానున్నాయి. విలీనం అయిన వెంటనే ప్రస్తుత కమిషనర్‌ను కొనసాగిస్తూనే జీహెచ్‌ఎంసీకి ముఖ్య కార్యదర్శి హోదా ఉన్న సీనియర్‌ అధికారిని చీఫ్‌ కమిషనర్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతున్నది. జీహెచ్‌ఎంసీ ప్రస్తుత విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్ల నుంచి ఏకంగా 2,735 చదరపు కిలోమీటర్లకు పైగా పెరగనున్న నేపథ్యంలో విలీన మున్సిపాలిటీల జనాభా, ఆస్తులు, ఉద్యోగులు, పాలన స్వరూపంపై అధ్యయనం చేస్తున్నారు. గడిచిన నాలుగు రోజులుగా సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌, పారిశుధ్య విభాగం అధికారులతో వరుస సమీక్షలు జరుగుతున్నాయి. అయితే విలీనం సందర్భంగా కొన్ని మున్సిపాలిటీల్లో పెండింగ్‌ ఫైళ్లు చకచకా కదులుతున్నాయి. సిటీబ్యూరో, డిసెంబర్‌ 1 (నమస్తే తెలంగాణ) ; జీహెచ్‌ఎంసీలో అక్రమ నిర్మాణాలకు ఓసీలు, అక్రమంగా అనుమతుల మంజూరుతోపాటు వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను క్లియరెన్స్‌ చేసే పనిలో మున్పిపాలిటీల అధికారులు పోటీ పడుతున్నట్లు తెలుస్తున్నది. జీహెచ్‌ఎంసీలో ఏడు మున్సిపల్‌ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను విలీనం చేయాలని గత నెల 25న జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఆమోదించడం..వెంటనే జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలోనూ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లల్లో పెండింగ్‌ ఫైళ్లకు రెక్కలొచ్చాయి. విలీన ప్రక్రియ పూర్తయితే మున్సిపల్‌ అధికారుల పవర్‌కు కోత పడే అవకాశమున్నది. విలీనం తర్వాత నిర్మాణాల అనుమతులు ఎన్‌వోసీల జారీ వంటి ప్రక్రియ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే జరుగుతాయి. దీంతో అనేక మంది అక్రమ నిర్మాణదారులు, నకిలీ ఎన్‌వోసీలు ఇప్పుడే తీసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు మున్సిపాలిటీ ఉద్యోగుల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో కొందరు అధికారులూ డబ్బులు తీసుకుని అడ్డగోలుగా పెండింగ్‌ ఫైళ్లను క్లియర్‌ చేసేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున ఎన్‌వోసీలు జారీ.. విలీనం కానున్న మున్సిపాలిటీలతోపాటు నగరపాలక సంస్థలో వివిధ అనుమతుల కోసం పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా చెరువులు, కుంటల పరిసరాల్లో భవన నిర్మాణాలు, విల్లాలు అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి ఎన్‌వోసీల అవసరం తప్పనిసరి. ఇరిగేషన్‌ అధికారులతో క్లియరెన్స్‌ తీసుకుని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లల్లో ఎన్‌వోసీలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లల్లో ఎన్‌వోసీలు కూడా పెద్ద ఎత్తున పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న ఎన్‌వోసీలను వెంటనే క్లియర్‌ చేయించుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా శివారు మున్సిపాలిటీల్లో చెరువులు, కుంటలు, వాగులు పెద్ద ఎత్తున ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే, ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోనూ చెరువులు, కుంటల్లో నిర్మాణాల కోసం పెట్టుకున్న పెద్ద ఎత్తున దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ అధికారులు త్వరగా క్లియర్‌ చేస్తున్నట్లు తెలుస్తున్నది. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కూడా అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చే పనిలో బిజీబిజీగా ఉన్నట్లు.. గడిచిన ఐదు రోజుల వ్యవధిలో జారీ చేసిన ఎన్‌వోసీలు, అనుమతులపై ప్రభుత్వం విచారణ జరిపాలన్న డిమాండ్‌లు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇంటి అనుమతులకు సంబంధించిన ఫైళ్లు వేగంగా కదులుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలకు ఇంటి నంబర్లు ఇచ్చేలా సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతున్నది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో పరిధిలో విలీన పక్రియ పూర్తయ్యే వరకు అనేక అక్రమాలకు అవకాశం ఉన్న క్రమంలో ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :