Studio18 News - తెలంగాణ / : Illegal Villas Demolition : హైదరాబాద్ అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. మణికొండ చిత్రపురి కాలనీలో అక్రమంగా నిర్మించిన విల్లాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రెండో రోజూ అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేస్తున్నారు. భారీ యంత్రాల సాయంతో భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చిత్రపురి సొసైటీ సభ్యులు 220 విల్లాల నిర్మాణాలకు పర్మిషన్ తీసుకున్నారు. అయితే, అదనంగా 7 విల్లాలను అక్రమంగా నిర్మిస్తున్నారు. దీన్ని గుర్తించిన అధికారులు చర్యలు చేపట్టారు. అక్రమ విల్లాలను నేలమట్టం చేస్తున్నారు. నిన్న రెండు విల్లాలను కూల్చేశారు. మిగిలిన వాటిని ఇవాళ తొలగిస్తున్నారు.
Admin
Studio18 News