Monday, 08 December 2025 03:23:40 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

KTR: బస్తీ దవాఖానాలను పరిశీలించిన మాజీ మంత్రులు.. వీడియో ఇదిగో!

Date : 21 October 2025 07:31 PM Views : 154

Studio18 News - TELANGANA / HYDERABAD : బస్తీ దవాఖానాలలో పేరుకుపోయిన సమస్యలు వైద్యులకు నాలుగు నెలలుగా జీతాలివ్వడంలేదు ప్రభుత్వంపై మండిపడ్డ కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన బస్తీ దవాఖానాలు ప్రస్తుతం సమస్యలతో సతమతం అవుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖానాలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. నిరుపేదలకు వైద్య సేవలను అందించే సదుద్దేశంతో తమ ప్రభుత్వం ఈ బస్తీ దవాఖానాలపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ఈ రోజు ఖైరతాబాద్ లోని బస్తీ దవాఖానాను మాజీ మంత్రి కేటీఆర్ సందర్శించారు. అక్కడి వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాలుగు నెలలుగా తమకు జీతాలు రావడంలేదని అక్కడి మహిళా వైద్యురాలు కేటీఆర్ కు తెలిపారు. ఓల్డ్ లింగంపల్లి బస్తీ దవాఖానాలోనూ ఇదే సమస్య నెలకొందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఇక్కడి వైద్యులకు కూడా నాలుగు నెలలుగా జీతాలు అందడంలేదని చెప్పారు. ఓల్డ్ లింగంపల్లిలోని బస్తీ దవాఖానాను హరీశ్ రావు సందర్శించారు. వైద్యులు, అక్కడికి వచ్చిన రోగులతో ఆయన మాట్లాడారు. మరోవైపు, బోరబండలోని వినాయకరావు నగర్ లో ఉన్న బస్తీ దవాఖానాను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఈ రోజు ఉదయం సందర్శించారు. అక్కడి వైద్యులతో హెల్త్ చెకప్ చేయించుకున్నారు. వైద్యులు, రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిరుపేదల చెంతకే వెళ్లి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ సూచనలతో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని ఆయన గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బస్తీ దవాఖానాలను ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. వైద్యులకు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :