Tuesday, 31 March 2026 02:49:57 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Kishan Reddy: మేడారంలో మొక్కులు చెల్లించుకున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జువల్ ఓరం

Date : 29 January 2026 06:52 PM Views : 158

Studio18 News - TELANGANA / MULUGU : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను సందర్శించిన కేంద్ర మంత్రులు గద్దెలపై నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న ఓరం, కిషన్ రెడ్డి గిరిజనుల మహా కుంభమేళా ఈ జాతర అని అభివర్ణించిన జువల్ ఓరం రూ.890 కోట్లతో సమ్మక్క-సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు గిరిజన అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుందని వెల్లడి ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క - సారలమ్మ జాతరను కేంద్ర మంత్రులు గురువారం సందర్శించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద వారికి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ సాదర స్వాగతం పలికారు. గిరిజన డప్పు వాయిద్యాల మధ్య ఆలయంలోకి ప్రవేశించిన కేంద్ర మంత్రులు, గద్దెలపై 'నిలువెత్తు బంగారం' సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం జువల్ ఓరం మీడియాతో మాట్లాడుతూ, సమ్మక్క - సారలమ్మ జాతర గిరిజనుల మహా కుంభమేళా అని అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు, 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. గిరిజన సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని, పీఎం జన్‍మన్ పథకం కింద రూ. 24,000 కోట్లు, తెలంగాణకు 23 ఏకలవ్య పాఠశాలలు కేటాయించినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, జాతర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ ప్రాంత పర్యాటక అభివృద్ధికి రూ. 80 కోట్లు, రామప్ప ఆలయానికి రూ. 40 కోట్లు, జాతర ఏర్పాట్లకు ఈ ఏడాది రూ. 3.70 కోట్లు కేటాయించినట్లు వివరించారు. మేడారంలో సమ్మక్క - సారలమ్మ పేరుతో రూ. 890 కోట్ల వ్యయంతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. త్వరలోనే ప్రధాని ఈ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభిస్తారని ఆయన స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :