Sunday, 29 March 2026 05:20:56 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Congress rule | పాలకుల పర్యవేక్షణ లోపంతో మురికికూపాలైన నగర చెరువులు.. Videos

Congress rule | కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లే అయినా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుంది. అన్ని రంగాల వారినీ నమ్మించి మోసం చేసి

Date : 28 January 2026 06:13 PM Views : 113

Studio18 News - TELANGANA / HYDERABAD : హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లే అయినా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుంది. అన్ని రంగాల వారినీ నమ్మించి మోసం చేసింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కింది. రైతులకు ఎకరానికి రూ.15 వేల రైతుబంధు ఇస్తానని మాట తప్పింది. పైగా ఇప్పటికే మూడు దఫాలు రైతుబంధు ఇవ్వకుండా ఎగవేసింది. కళ్యాణిలక్ష్మి కింద ఇచ్చే నగదుతోపాటు తులం బంగారం ఇస్తానని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ గొప్పలు చెప్పింది. కానీ ఇప్పటికీ తులం బంగారానికి దిక్కులేదు. ఆసరా పించన్‌లను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ నేతలు కోతలు కోశారు. కానీ ఇప్పటికే ఆ హామీని అమలు చేయలేదు. ఆఖరికి రైతులకు యూరియా ఇవ్వడం కూడా ఈ కాంగ్రెస్‌ పాలకులకు చేతగాలేదు. బస్తా యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వచ్చింది. హైడ్రాను అడ్డంపెట్టుకుని ఆక్రమణల పేరుతో పేదల ఇళ్లను ఈ సర్కారు కూలగొడుతోంది. వారిని మానసిక క్షోభకు గురిచేస్తోంది. అంతేగాదు ఏ వర్గానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేలు జరుగలేదు. దాంతో అందరిలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయింది. అందుకే మొన్న సర్పంచ్‌ ఎన్నికల్లో జనం కాంగ్రెస్‌ గట్టి గుణపాఠం చెప్పారు. హామీల సంగతి పక్కన పెడితే.. రాష్ట్ర రాజధాని నగరంలో చెరువుల పర్యవేక్షణ కూడా ఈ ప్రభుత్వానికి చేతగావడం లేదు. కాంగ్రెస్ సర్కారు పర్యవేక్షణాలోపంతో హైదరాబాద్‌లోని చెరువులన్నీ పూర్తిగా గుర్రపు డెక్కతో నిండిపోయాయి. ఎల్బీనగర్ మంత్రాల చెరువు, జిల్లెలగూడలో చందన చెరువు, నాచారం HMT నగర్‌ చెరువు, మాదాపూర్‌లోని దుర్గం చెరువు మొదలైనవి నగరంలోని చెరువులు దుస్థితికి కొన్ని ఉదాహరణలు. దాదాపు అన్ని చెరువులు మురికికూపాలుగా, కాలుష్య కాసారాలుగా మారాయి. ఇవే చెరువులు కాంగ్రెస్‌ అధికారంలోకి రాకమునుపు బ్రహ్మాండంగా ఉండేవి. కాంగ్రెస్‌ పాలనలో పర్యవేక్షణాలోపం కారణంగా ఇప్పుడు చెరువులన్నీ నాశమైపోయాయి. ప్రస్తుతం నగరంలోని చెరువుల దుస్థితిని కింది వీడియోల్లో మీరు కూడా చూడవచ్చు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :