Studio18 News - తెలంగాణ / : CM Revanth Reddy on Kavitha Bail: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై తీహార్ జైలు నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ”కవిత బెయిల్ కోసం ఎంపీ సీట్లు బీఆర్ఎస్ త్యాగం చేసింది నిజం బీఆర్ఎస్ – బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చింది. సిసోడియా, కేజ్రీవాల్‌కు రాని బెయిల్ 5 నెలల్లోనే కవితకు ఎలా వచ్చింది? మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో బీజేపీకి మెజారిటీ ఇచ్చింది నిజం కాదా? ఏడు చోట్ల డిపాజిట్ కోల్పోయి, 15 చోట్ల మూడవ స్థానం వచ్చేంత బలహీనంగా బీఆర్ఎస్ ఉందా?” అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న పనులకు చేరికలకు సంబంధం లేదని, ఎవరినో భయపెట్టి చేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని, ప్రభుత్వ విధానాలు నచ్చి వస్తే చేర్చుకుంటామని తెలిపారు. చెరువుల కబ్జాపై నిజనిర్ధారణ కమిటీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కమిటీకి హరీష్ రావు నేతృత్వం వహించినా ఫర్వాలేదన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ మాట్లాడాలనే కోరుకుంటున్నామని, ప్రభుత్వం ప్రతిపక్ష నేతగా జీతభత్యాలు తీసుకుంటున్నారు.. మరి పనిచేయాలిగా? అని ప్రశ్నించారు. ప్రజల ప్రయోజనం కోసమే హైడ్రా తెచ్చామని చెరువులో నిర్మాణాలు చేస్తే ఎంతటి వారైనా ఒకటే యుద్ధ ప్రాతిపాదికన కూల్చివేతలు పూర్తిచేస్తామన్నారు. లీడర్స్, హీరోలు ప్రజలకు రోల్ మోడల్ గా ఉండాలని సూచించారు. రుణమాఫీపై మాట్లాడుతూ.. ”కేసీఆర్ ప్రభుత్వం 2018-24 వరకు రుణమాఫీ చేసింది 13,329 కోట్లు. మా ప్రభుత్వం 27 రోజుల్లో 18 వేలకోట్లు రుణమాఫీ చేశాం. రైతును రుణవిముక్తి చేయడం మా లక్ష్యం.. టెక్నికల్ అంశాలతో రుణమాఫీ జరగని వారు కలెక్టర్ కు వివరాలు ఇవ్వండి. రుణమాఫీ కానీ వారి వివరాలు కేటిఆర్, హరీశ్ కూడా ఇవ్వొచ్చు.. వారి వివరాలు ఇచ్చి పాపాలు కడుక్కోండి. అక్రమ కట్టడాల కూల్చివేతపై కేసీఆర్ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో తెలుసు. గతంలో స్వార్థం కోసం.. నిర్మాణాల కూల్చివేత జరిగింది.. ఆగింది. కానీ నేను రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ను కాను.. ఆయనతో పోలికే ఉండద” ని సీఎం రేవంత్ అన్నారు.
Admin
Studio18 News