Studio18 News - TELANGANA / JAGTIAL : పట్టణంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా, 47వ వార్డులో అతి పెద్ద గంజ్ నాలాలో జరుగుతున్న సిల్ట్ తొలగింపు పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, రాబోవు వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా ఉండేందుకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు నాలాల శుభ్రత పనులను ప్రత్యేకంగా చేపట్టినట్లు తెలిపారు. గంజ్ నాలాలో పేరుకుపోయిన సిల్ట్‌ను పూర్తిగా తొలగించి నీటి ప్రవాహం సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా, పట్టణ ప్రజలు మురికి కాలువలలో మరియు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదని, అవే తిరిగి కాలువల్లో కలుస్తూ అంతరాయం కలిగిస్తున్నందున ప్రజలు సహకరించమని సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు అయి విజయవంతం కావాలని చైర్‌పర్సన్ కోరారు.
Admin
Studio18 News