Studio18 News - TELANGANA / RANGAREDDY : ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని రాజేంద్రనగర్ ఎం.ఈ.ఓ. శంకర్ రాథోడ్, ఎం. వి. ఐ. కృష్ణవేణి, ఏ. ఎం. వి. ఐ. శ్రీముఖి లు పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రంగారెడ్డి జిల్లా రాజెంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి ట్రాఫిక్ నియమాలు మరియు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.... యువత లైసెన్సు లేనిది వాహనం నడపరాదని , హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతే ప్రమాదాలకు గురవుతారని, మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఎం. ఆర్. వో. రాములు, ట్రాఫిక్ పోలీసులు. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News