Saturday, 24 January 2026 07:52:53 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Durgam cheruvu: దుర్గం చెరువులోకి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. పోలీసుల విచారణలో వెలుగులోకి కీలక విషయాలు

Date : 27 July 2024 10:58 AM Views : 395

Studio18 News - TELANGANA / : Software Employee Suicide : హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువులో దూకి సాప్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు విచారణ చేపట్టగా.. ప్రేమ వ్యవహారం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మాదాపూర్ నాలెడ్జ్ సిటీలోని సాప్ట్ వేర్ కంపెనీలో ముషీరాబాద్ కు చెందిన బాలాజీ(25) ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రోజూమాదిరిగానే ఈనెల 24న ఉదయం ఆఫీస్ కు వెళ్లిన బాలాజీ.. అర్ధరాత్రి అయిన ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ఆఫ్ రావడంతో, బాలాజీ స్నేహితులకు ఫోన్ చేశారు. అయినా అతని ఆచూకీ లభించకపోవడంతో ఈనెల 25వ తేదిన రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. రాయదుర్గం పోలీసులు ఐటీ కంపెనీలో విచారించగా 24వ తేదీ రాత్రి 8:30గంటల సమయంలో బాలాజీ బయటికి వెళ్లినట్లు తెలిపారు. సీసీ కెమెరాల్లో మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ మీదుగా కిందికి దిగినట్లు పోలీసులు గుర్తించారు. దుర్గం చెరువులో గాలిస్తుండగా శుక్రవారం సాయంత్రం నీటిలో బాలాజీ మృతదేహం లభ్యమైంది. మెడలో ఉన్న ఐడీ కార్డు ఆధారంగా బాలాజీగా పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా బాలాజీ ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. యువతి పెళ్లికోసం ఒత్తిడి చేయగా ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు చెప్పలేక బాలాజీ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రేమ వ్యవహారమే బాలాజీ ఆత్మహత్యకు కారణంగా పోలీసుల ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించిన రాయదుర్గం పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :