Studio18 News - TELANGANA / : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి రావడంపై మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కారు రేసింగ్ కేసులో అంతర్జాతీయ చట్టాల ప్రకారం కేటీఆర్ కు బెయిల్ కూడా వచ్చే అవకాశాలు లేవని అన్నారు. కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని చెప్పారు. ఆయన ఏడేళ్లు జైల్లో ఉండాల్సి వస్తుందని అన్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ కు బెయిల్ రావాలని మొక్కుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శబరిమలకు వెళ్లడానికి నల్ల దుస్తులు ధరించినట్టుందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ అరెస్ట్ అయితే ఆయనకు బెయిల్ రావాలని శబరిమలకు వెళ్లి మొక్కుతారని అన్నారు. మరోవైపు కేటీఆర్ పై విచారణకు రాష్ట్ర గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Also Read : రాష్ట్రపతి ముర్ముకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్వాగతం
Admin
Studio18 News