Studio18 News - TELANGANA / : హైదరాబాద్‌లోని మియాపూర్ మెట్రోస్టేషన్ సమీపంలో చిరుత సంచారం అంటూ జరిగిన ప్రచారంపై తాజాగా అటవీశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం రాత్రి ఓ అపార్ట్‌మెంట్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో చిరుత సంచరించడం కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులతో కలిసి ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు చిరుత కోసం తీవ్రంగా గాలించారు. చిరుత పాదముద్రలను గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు తీవ్రంగా శ్రమించారు. కానీ, ఎక్కడా చిరుత పాదముద్రల ఆనవాళ్లు కనిపించలేదు. దాంతో ఇవాళ ఉదయం అధికారులు అపార్ట్‌మెంట్ సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులోని దృశ్యాల ఆధారంగా ఆ జంతువు కదిలికలను బట్టి అది చిరుత కాదని నిర్ధారణకు వచ్చారు. అది అడవి పిల్లి అని అటవీశాఖ అధికారులు తేల్చారు. దాంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Admin
Studio18 News