Studio18 News - TELANGANA / : Begumpet Road Accident : బేగంపేట్ లైఫ్ స్టైల్ బిల్డింగ్ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. ఎస్పీఎఫ్ సబ్ ఇన్ స్పెక్టర్ శంకర్ రావు తన కుమార్తె ప్రసన్నతో కలిసి ఇంటి నుంచి కాలేజీకి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఎదురుగా టెంపో వాహనం వెనుక నుంచి వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. టెంపో వాహనం వేగంగా వచ్చి బైక్ ను ఢీకొట్టడంతో సబ్-ఇన్‌స్పెక్టర్ శంకర్ రావుకు గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో బైక్ వెనుక కూర్చున్న యువతి మృతి చెందింది. గాయాలైన శంకర్ రావును స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Studio18 News