Saturday, 14 December 2024 06:03:37 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

మహిళా కమిషన్ వర్సెస్ కాంగ్రెస్ నేత..! చిచ్చు రాజేసిన వేణుస్వామి వ్యవహారం..!

Date : 21 August 2024 09:57 AM Views : 36

Studio18 News - తెలంగాణ / : Gossip Garage : ఆ ఇద్దరు స్టార్ల పెళ్లి ముచ్చట. జోస్యం చెప్పింది ఓ జ్యోతిష్యుడు. యాక్షన్ కాంగ్రెస్ సర్కార్‌ది. అబ్జక్షన్ కాంగ్రెస్ లీగల్ సెల్ ఛైర్మన్‌ది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఓ హీరో హీరోయిన్ పెండ్లికి సంబంధించి జ్యోతిష్యుడు చెప్పిన జాతకం కాస్త కాంట్రవర్సీకి దారితీసింది. ఈ విషయంలో తెలంగాణ మహిళా కమిషన్ ఆ ఆస్ట్రాలజర్‌కు నోటీసులు ఇచ్చింది. మీకా అర్హత లేదంటున్నారు తెలంగాణ పీసీసీ లీగల్‌ సెల్ నేత. యాక్షన్‌ తీసుకున్నది వాళ్లే.? అర్హత లేదంటున్నదే కూడా వాళ్లే. ఇంతకు అసలు మ్యాటర్ ఏంటి.? వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు.. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు తయారైంది వేణుస్వామి పరిస్థితి. నాగచైతన్య, శోభిత పెండ్లిపై జోతిష్యం చెప్పిన వేణుస్వామిపై ఫిల్మ్ జర్నలిస్టులు మహిళ కమిషన్‌ కు ఫిర్యాదు చేశారు. అసలు నాగచైతన్య, శోబిత పెళ్లిపై వేణుస్వామి ఎందుకు జ్యోతిష్యం చెప్పాలి… సరే ఏదో బుద్ది గడ్డి తిని చెప్పారు అనుకుందాం…దానిపై ఏ సంబంధం లేని ఫిల్మ్‌ జర్నలిస్టులు ఎందుకు ఫిర్యాదు చేయడం… సరే ఏదో అత్యుత్సాహంతో వారు ఫిర్యాదు చేశారనుకుందాం… వెనుకా ముందూ చూడకుండా వేణుస్వామికి మహిళా కమిషన్‌ నోటీసులు ఇచ్చిందా… ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ సర్కార్ నియమించిన ఉమెన్ కమిషన్‌ తీరుపై కాంగ్రెస్ నేత అభ్యంతరం.. వేణుస్వామిపై యాక్షన్‌కు రెడీ అయిన తెలంగాణా మహిళా కమిషన్‌ చైర్ పర్సన్‌ నేరెళ్ల శారద.. ఆయనను ఈనెల 22న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు వేణుస్వామికి నోటీసులు ఇచ్చే అర్హత మహిళా కమిషన్‌కు లేదంటూ..ఓ లాయర్ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ లాయర్‌ మరెవరో కాదు.. ఏకంగా తెలంగాణ పీసీసీ లీగల్‌ సెల్‌ కన్వీనర్‌, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ సోదరుడు పొన్నం అశోక్‌ గౌడ్‌. ఇప్పుడు ఇదే రాజకీయ రచ్చకు దారితీస్తోంది. వేణుస్వామికి నోటీసులు ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్ నియమించిన ఉమెన్ కమిషనే. వేణుస్వామికి నోటీసులు ఇచ్చే అర్హత మహిళా కమిషన్‌కు లేదంటూ కోర్టులో పిటీషన్ వేసింది కూడా కాంగ్రెస్ లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ కావడం ఆసక్తికరంగా మారింది. విచారణకు రావాలని వేణుస్వామికి నోటీసులు.. ఈ నెల 8న నాగచైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. వెంటనే వేణుస్వామి ఓ వీడియో రిలీజ్ చేశారు. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వైవాహిక జీవితం సక్రమంగా సాగదంటూ జాతకం చెప్పారు. మూడేళ్లలో వారిద్దరూ విడిపోతారని జోస్యం చెప్పారు. మరో మహిళ ప్రమేయం కారణంగా 2027లో ఈ జంట విడిపోతారని అంచనా వేసి వివాదానికి తెరలేపారు వేణుస్వామి. దీనిపై తెలుగు ఫిల్మ్ జర్న లిస్ట్ అసోసియేషన్, కొంతమంది జర్నలిస్టులు.. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ మహిళా కమిషన్ ఈ నెల 12న వేణుస్వామికి నోటీసులు జారీ చేసి.. ఈ నెల 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని కోరింది. వేణుస్వామి తరఫున పీసీసీ లీగల్‌ సెల్ కన్వీనర్ వకాల్తా ఏంటి.? మహిళా జర్నలిస్ట్‌ల ఫిర్యాదుతో వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. ఆ ఉమెన్ కమిషన్‌ను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందే. ఇప్పుడు మహిళా కమిషన్‌కు అర్హత లేదంటుంది కూడా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్‌ పొన్నం అశోక్‌ గౌడ్. అతను ఎవరో కాదు మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడు. ఈ ఓవరాల్ టాపిక్‌ చూశాక అసలేం జరుగుతుందో అర్థం కాని సిచ్యవేషన్. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం ఏంటి..ఉమెన్ కమిషన్‌కు ఆ అర్హత లేదంటూ.. వేణుస్వామి తరఫున కాంగ్రెస్‌ పార్టీకే చెందిన మంత్రి సోదరుడు, పీసీసీ లీగల్‌ సెల్ కన్వీనర్ వకాల్తా పుచ్చుకోవడం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. మహిళా కమిషన్‌ ను టార్గెట్‌ చేసేందుకు బీఆర్ఎస్ కు ఛాన్స్..! తెలంగాణ మహిళా కమిషన్‌ పరిధి దాటి వ్యవహరించిందని పిటీషన్‌లో పేర్కొన్నారు పీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ అశోక్‌ గౌడ్. చట్ట విరుద్ధంగా, ఏకపక్షంగా, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉమెన్‌ కమిషన్ వేణుస్వామికి నోటీసులు ఇచ్చిందని..వాటిని సస్పెండ్ చేయాలని కోర్టును కోరారు పీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ పొన్నం అశోక్‌ గౌడ్. అటు కేటీఆర్‌ కు నోటీసులు ఇచ్చి…బీఆర్‌ఎస్‌ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న మహిళా కమిషన్‌ కు ఇప్పుడు పొన్నం అశోక్‌ గౌడ్‌ నోటీసులు పంపడం ఇంట్రస్టింగ్‌ మారింది. ఇప్పుడిది బీఆర్‌ఎస్‌కు కూడా మహిళా కమిషన్‌ ను టార్గెట్‌ చేసేందుకు మరో అస్త్రంగా మారేలా కన్పిస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :