Studio18 News - తెలంగాణ / : మద్యానికి మానిసగా మారితే కుటుంబాలు నాశనమవుతాయని కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. వైన్ షాపుల వద్ద కొనసాగే పర్మిట్ రూమ్ లను సాయంత్రం 6 గంటలకు తెరవాలని చెప్పారు. ఉదయం 10 గంటలకే పర్మిట్ రూమ్ లను తెరిస్తే జనాలు ఉదయం నుంచే తాగడం ప్రారంభిస్తారని అన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి పర్మిట్ రూమ్ లను తెరిచే కార్యక్రమాన్ని మునుగోడు నుంచి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తాను చర్చిస్తానని చెప్పారు. స్థానిక మద్యం దుకాణాల నిర్వాహకులే నాలుగైదు గ్రామాల మధ్య ఒక సబ్ దుకాణం ఏర్పాటు చేసి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం విక్రయిస్తే బాగుంటుందని కోమటిరెడ్డి అన్నారు. దీనివల్ల ఆదాయం పెరగడమే కాకుండా... గొలుసు దుకాణాల నిర్మూలనకు అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.
Admin
Studio18 News