Sunday, 08 March 2026 09:41:33 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

పట్టు వదలని విక్రమార్కుడు, పొలిటికల్‌ పోరాట యోధుడికి మంచి రోజులు వచ్చినట్లేనా?

Date : 14 September 2024 12:07 PM Views : 499

Studio18 News - TELANGANA / : Gossip Garage : ఆయనో పట్టు వదలని విక్రమార్కుడు… పొలిటికల్‌ అరంగేట్రం చేసిన నుంచి పోరాటమే ఆయన పంథా.. ఎన్నిసార్లు పోటీచేసినా ఇంతవరకు గెలుపు పిలుపు అందుకోలేకపోయారు. దానికి కారణం ఆయన ఎంచుకున్న నియోజకవర్గమే.. బీఆర్‌ఎస్‌ టాప్‌2 లీడర్‌ కేటీఆర్‌కు ప్రత్యర్థిగా అలుపెరగని పోరాటం చేస్తున్న ఆ నేతకు ఎట్టకేలకు మంచి రోజులొస్తున్నాయట.. నమ్ముకున్న పార్టీ అధికారంలో ఉండటంతో ఆ పొలిటికల్‌ పోరాట యోధుడికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందట.. దీంతో ఆయన అనుచరుల్లో ఒకటే ఉత్కంఠ పెరుగిపోతోంది. తమ నేతకు ఏ పదవి దక్కుతుందా? అని అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఐదుసార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు.. కే.కే.మహేందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి జై తెలంగాణ అంటూ గళం విప్పిన లీడర్. రెండు దశాబ్దాలుగా ప్రతిపక్ష నేతగానే కొనసాగుతున్న కేకే మహేందర్‌రెడ్డికి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయనే ప్రచారం ఆయన అనుచరుల్లో ఉత్సాహం నింపుతోంది. అటు కే.కే. మహేందర్‌రెడ్డికి కొత్త ఉత్తేజం తెస్తోందంటున్నారు. నాడు ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్‌తో పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన కే.కే.మహేందర్‌రెడ్డి వరుసగా ఐదుసార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయ ప్రత్యర్థి కేటీఆర్‌తో ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్న కే.కే.మహేందర్‌రెడ్డిని పట్టు వదలని విక్రమార్కుడిగా చెబుతుంటారు. కే.కే.మహేందర్‌రెడ్డికి ఏ పదవి ఇస్తారు? తొలుత వామపక్ష విద్యార్థి సంఘాల్లో పనిచేసిన కేకే మహేందర్‌రెడ్డి.. 2009లో తొలిసారి అసెంబ్లీకి పోటీ చేయగా, కేవలం 171 ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో అప్పటి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వకపోవడం వల్ల కేటీఆర్‌పై స్వతంత్రంగా పోటీ చేసి ఓటమి అంచుల వరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత కేటీఆర్‌ నిలదొక్కుకోవడంతో కే.కే.మహేందర్‌రెడ్డికి గెలుపు పిలుపు అందలేదు. కానీ, ఆయన ఏనాడూ నిరాశ చెందలేదు. కాంగ్రెస్‌ కార్యకర్తలకు అండగా నిలుస్తూ.. కేటీఆర్‌తో అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండటంతో కే.కే.మహేందర్‌రెడ్డికి ఏ పదవి ఇస్తారా? అని కాంగ్రెస్‌ క్యాడర్‌ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైంది. ఇప్పటికే చాలా మందికి నామినేటెడ్ పోస్టుల్లో నియమించిన పార్టీ… కే.కే.మహేందర్‌రెడ్డిని వదిలేసిందని విమర్శలు ఎదుర్కొంది. అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామనే హామీతోనే వెయిటింగ్‌లో పెట్టినట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల్లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో తొలి అవకాశం కే.కే.మహేందర్‌రెడ్డికే ఇస్తారని చెబుతున్నారు. రెండు దశాబ్దాలుగా ఎదురుచూపులు.. రెండు దశాబ్దాలుగా గెలుపోటములతో సంబంధాలు లేకుండా రాజకీయ పోరు సాగిస్తున్న మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని ఆయన వర్గీయులు ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీ హామీతో మహేందర్‌రెడ్డి కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు. రెండు దశాబ్దాలుగా చట్టసభల్లో అడుగు పెట్టాలనే తన ఆకాంక్ష త్వరలో ఫలించే అవకాశం ఉందన్న సమాచారంతో… మంచి రోజులు ఎప్పుడొస్తాయా? అని ఎదురుచూస్తున్నారట… మొత్తానికి కాంగ్రెస్‌ అధినాయత్వం హామీతో సిరిసిల్ల కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పటికైనా ఆయన నిరీక్షణ ఫలిస్తుందా? మొత్తానికి కే.కే.మహేందర్‌రెడ్డి ఎపిసోడ్‌ కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. రాజకీయల్లో ఫాస్ట్ ట్రాక్‌లో పదవులు పొందిన నేతలు ఎందరో ఉన్నారు… బై పాస్‌లో వచ్చి కుర్చీ మీద కూర్చున్న నేతలు చాలా మంది కనిపిస్తుంటారు. కానీ.. ఏ పదవీ లేకుండా మహేందర్‌రెడ్డి వంటి నేతలు అరుదుగా కనిపిస్తుంటారు. ఇప్పటికైనా ఆయన నిరీక్షణ ఫలిస్తుందో? లేదో? అన్నదే ఆసక్తికరంగా మారింది. మహేందర్‌రెడ్డి కల నెరవేరాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :