Studio18 News - తెలంగాణ / : జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో నార్సింగి పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. నిన్న జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు అంశాలను పేర్కొన్నారు. నేరాన్ని జానీ మాస్టర్ అంగీకరించినట్లు తెలిపారు. 2019లో జానీ మాస్టర్‌తో బాధితురాలికి పరిచయమైనట్లు తెలిపారు. దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాలిని అసిస్టెంట్‌గా చేర్చుకున్నట్లు వెల్లడించారు. 2020లో ముంబైలోని ఓ హోటల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయస్సు కేవలం 16 మాత్రమే అని తెలిపారు. నాలుగేళ్లుగా బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారన్నారు. లైంగిక దాడి విషయం బయటకు రాకుండా జానీ ఆమెను బెదిరించాడన్నారు.
Admin
Studio18 News