Monday, 16 March 2026 01:54:53 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

మహిళా శక్తికి ప్రెస్ క్లబ్ ఘన వందనం

Date : 09 March 2026 02:08 PM Views : 14

Studio18 News - TELANGANA / KHAMMAM : ఖమ్మం నగరంలోని ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యుజేఎఫ్–హెచ్ 2843) మరియు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంతోటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సమాజంలోని వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళా మూర్తులను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఐసీడీసిఎస్ అధికారిణి వేల్పుల విజేత మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలతో పాటు వృత్తి జీవితంలో కూడా మహిళలు ముందంజలో నిలవడం సమాజానికి ఆదర్శమని తెలిపారు. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే పురుషుల సహకారం ఎంతో అవసరమని అన్నారు. తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ, ఈరోజు తాను ఈ స్థాయిలో నిలబడటానికి తన భర్త అందించిన పూర్తి సహకారమే కారణమని విజేత భావోద్వేగంగా పేర్కొన్నారు. ప్రతి మహిళ తన లక్ష్యాలను చేరుకోవాలంటే భర్త వెన్నుదన్నుగా నిలిస్తే వారు అద్భుతాలు సృష్టించగలరని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ హారిక నాయుడు మాట్లాడుతూ మహిళా సాధికారత మాటల్లోనే కాకుండా కార్యరూపంలో కనిపించాలన్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న జర్నలిస్టుల సేవలను కొనియాడుతూ, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తు చేశారు. జిల్లా అధ్యక్షుడు టి. సంతోష్ చక్రవర్తి, ప్రధాన కార్యదర్శి నానబాల రామకృష్ణ, కోశాధికారి అర్వపల్లి నగేష్ మాట్లాడుతూ జర్నలిజం రంగంలో మహిళా విలేకరులు ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు గౌరవరపు జగదీష్, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారిణి రమాదేవి, న్యాయవాది శృతి, ఏఎస్ఐ పి. లక్ష్మి, విలేకరి నవజీవన ప్రియ, ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్షులు ఎలుగోటి వెంకట్రావు, ప్రెస్ క్లబ్ కోశాధికారి భద్రయ్య, జిల్లెల మహేష్, యాంకర్ నాయిని స్వాతి, యాంకర్ హర్షిక, యాంకర్ రేష్మ, అంతోటి నాగమణి, గౌరవరపు సునీత తదితరులతో పాటు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు, సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో విలేకరులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :