Saturday, 14 March 2026 09:49:55 PM
# పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా # రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు # జిల్లాలో జనాభా గణన–2025 కోసం చర్యలు ప్రారంభం # పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం # పెద్దమ్మ తల్లి 27వ వార్షికోత్సవంలో ఘనంగా బోనాల ఉత్సవం # రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు, తోఫా పంపిణీ # కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ అమ్మమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి # సికింద్రాపూర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు # కేంద్ర నిధులతో అక్కాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన # రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి : సీపీఐ జిల్లా కార్యదర్శి భూక్యా రమేష్ # ధర్పల్లి మండలంలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం # రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి # జిల్లాకు వచ్చిన అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్‌ను కలిసిన కలెక్టర్

జనాభా లెక్కల విధులను సమర్థవంతంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Date : 12 March 2026 11:00 AM Views : 89

Studio18 News - TELANGANA / MANCHERIAL : జనాభా లెక్కల విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ Kumar Deepak అన్నారు. బుధవారం జిల్లాలోని Naspur లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో Manoj తో కలిసి జిల్లాలోని మండలాల తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేయబోయే సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు జనాభా లెక్కల ప్రాతిపదిక ఉపయోగపడుతుందని తెలిపారు. జనాభా లెక్కల విధులను సక్రమంగా నిర్వహించాలని, తద్వారా ప్రజలకు అందించవలసిన మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలపై ప్రభుత్వానికి అవగాహన వస్తుందని పేర్కొన్నారు. జనాభా లెక్కల ప్రక్రియ నిర్వహణ, సాంకేతికత వినియోగం, ఇతర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిజిటల్ పద్ధతిలో జనాభా గణనను నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జనగణన ప్రక్రియను పారదర్శకంగా, లోపరహితంగా పూర్తి చేయాలని, జనగణన ద్వారా సేకరించే గణాంకాలు గ్రామ, పట్టణ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు పునాది వంటివని అన్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు, తాగునీటి సదుపాయాలు వంటి మౌలిక వసతుల కల్పనకు అలాగే సంక్షేమ పథకాలు అర్హులకు చేరవేయడానికి ఖచ్చితమైన గణాంకాలు అవసరమని తెలిపారు. వయస్సు, విద్యార్హత, వృత్తి, సామాజిక వర్గం, మౌలిక వసతుల వివరాలు వంటి అంశాల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని, ఖచ్చితమైన సమాచారం మాత్రమే నమోదు చేయాలని, 33 అంశాలపై సమగ్ర సమాచారం సేకరించాలని సూచించారు. మొదటి దశలో నివాస గృహాలతో పాటు అన్ని రకాల భవనాలు, కుటుంబ వివరాలను, రెండో దశలో వ్యక్తిగత వివరాలను సేకరించడం జరుగుతుందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా డిజిటల్ పద్ధతి ద్వారా జనాభా గణనను పూర్తిగా చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. జనాభా గణనలో అందరూ పాల్గొని వాస్తవ వివరాలను వెల్లడించాలని, ఎవరి వివరాలు బహిర్గతం కాకుండా సర్వర్‌లో నేరుగా నిల్వ ఉండేలా సాంకేతికతను వినియోగించడం జరుగుతుందని తెలిపారు. స్వీయ ప్రకటన చాలా ముఖ్యమని, అధికారులు, ఎన్యూమరేటర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అధికారులు ప్రతి రోజు జనాభా గణన ప్రక్రియను సమీక్షించాలని, నిర్ణీత కాలపరిమితిలోపు జనాభా గణన ప్రక్రియను మెరుగైన రీతిలో పూర్తి చేయడానికి అందుబాటులో ఉన్న సిబ్బంది సిద్ధంగా ఉండాలని తెలిపారు. ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల రూపకల్పనకు దోహదపడే జనాభా గణన ప్రక్రియను నిబద్ధతతో నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :