Monday, 02 December 2024 01:15:16 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

పొంగులేటి శ్రీనివాస రెడ్డికి 'బాంబుల శాఖ' అని పెట్టండి: కేటీఆర్

ఏ శాఖలో ఏ వర్గాన్ని ఎంత మోసం చేశారో ప్రజలకు వివరిస్తామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

Date : 10 November 2024 05:19 PM Views : 65

Studio18 News - తెలంగాణ / : తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాఖ ఏదో నాకు తెలియదు. కానీ ఆయనకు 'బాంబుల శాఖ' అని పెట్టండి. ఎందుకంటే ఈ బాంబు పేలుతుంది... ఆ బాంబు పేలుతుందని అన్నారు. మరి ఏ బాంబు పేలి కాంగ్రెస్‌లో ఎవరు ఎగిరిపోతారో ఆయనకే ఎరుక. మాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం పక్కా. వాళ్లని మాత్రం వదిలిపెట్టం. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యాల వారోత్సవం మేము నిర్వహిస్తాం’’ అని కేటీఆర్ అన్నారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7కు ఏడాది పూర్తవుతుంది. వారోత్సవాలు, విజయోత్సవాలు చేయాలట. వీళ్లేదో పీకి పందిరేశారట. మేము కూడా చేస్తాం. నవంబర్ 29 నాడు కేసీఆర్ నిరాహార దీక్ష మొదలుపెట్టిన రోజు. అవసరమైతే మేము కూడా పార్టీలో చర్చించి వీళ్ల పరిపాలనా వైఫల్యాల వారోత్సవం చేస్తాం, ప్రకటిస్తాం. ఏ శాఖలో ఏ వర్గాన్ని ఎంత మోసం చేశారో మేము చెబుతాం. పాదయాత్రలు, మిగతా కార్యక్రమాలు తర్వాత ఉంటాయి’’ అని కేటీఆర్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే ఏ కార్యక్రమంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారనేది పేర్కొనలేదు.

Also Read : ఈ అంశాల ఆధారంగానే పదవులు ఇచ్చాం... బాధ్యతగా పనిచేయండి: సీఎం చంద్రబాబు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :